టెస్ట్‌‌ స్టేడియాలు తక్కువ ఉండాలి: అశ్విన్‌‌

కాన్పూర్‌‌: పరిమిత సంఖ్యలో టెస్ట్‌‌ స్టేడియాలు ఉండటం ప్లేయర్లకు అనుకూలిస్తుందని టీమిండియా ఆఫ్‌‌ స్పిన్నర్‌‌ అశ్విన్‌‌ అభిప్రాయపడ్డాడు. అయితే దాని గురించి ఇప్పుడు వ్యాఖ్యానించడం సరైంది కాదన్నాడు. ‘కేవలం టెస్ట్‌‌లకు మాత్రమే పరిమితమైన స్టేడియాలు ఉండటం ప్లేయర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు వాళ్లు ఐదు స్టేడియాల్లో మాత్రమే టెస్ట్‌‌లు ఆడతారు. కాన్‌‌బెర్రాలో ఆడదామన్నా వాళ్లు ఒప్పుకోరు. ఎందుకంటే ఇతర వేదికల గురించి వాళ్లు పెద్దగా పట్టించుకోరు. ఇంగ్లండ్‌‌ పరిస్థితి కూడా సేమ్‌‌. ఎంపిక చేసిన టెస్ట్‌‌ సెంటర్లలో మాత్రమే ఈ ఫార్మాట్‌‌లో ఆడతారు. కానీ మన దగ్గర అలా జరగదు..’ అని అశ్విన్‌‌ పేర్కొన్నాడు.

టెస్ట్‌‌లకు మాత్రమే పరిమితమైన స్టేడియాలను మరింత బాగా అభివృద్ధి చేయొచ్చని, తద్వారా దేశం నలుమూలల నుంచి వచ్చే ప్లేయర్లు ఎక్కువగా వీటిపై దృష్టి పెడతారన్నాడు. రాబోయే రోజుల్లో టీమిండియా టెస్ట్‌‌ టీమ్‌‌లో జైస్వాల్‌‌, గిల్‌‌ అద్భుతాలు చేస్తారని అశ్విన్‌‌ కితాబిచ్చాడు.