వ్యవసాయ రంగంలో అద్భుత పురోగతి

వ్యవసాయ రంగంలో  రేవంత్ రెడ్డి సర్కార్ సాధించిన విజయం 66.77 లక్షల ఎకరాల్లో  153 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి.  సంవ త్సర కాలంలో వ్యవసాయ రంగంలో అద్భుత పురోగతి సాధించింది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడి కేవలం ఒక సంవత్సర కాలంలోనే దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా రాష్ట్ర రైతాంగానికి అనేక విప్లవాత్మక పథకాలను  ప్రవేశపెట్టి సమర్థవంతంగా  అమలుచేస్తోంది, దీని ఫలితంగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుత వానాకాలం పంట సీజన్​లో రికార్డు స్థాయిలో,  గతంలో మరెన్నడూ లేనివిధంగా 66 .77 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయింది.

 2023 ఖరీఫ్​లో  65.94 లక్షల ఎకరాల్లో 144.80 లక్షల  మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే ఉత్పత్తి అయింది. ఉత్పత్తి అయిన ధాన్యంలో సన్న రకాలకు రూ.500 లను బోనస్​గా అందిస్తున్నారు.  ధాన్యం కొనుగోలుకు గతంకన్నా 1322 కొనుగోలు కేంద్రాలు అదనంగా, మొత్తం 8066 కొనుగోలు కేంద్రాల ద్వారా ముమ్మరంగా ధాన్యం కొనుగోలు జరుగుతోంది. ఈ ధాన్యం కొనుగోలుకు  రూ.11,608.40 కోట్లను కేటాయించారు. 

రుణ విముక్తులైన  రైతన్నలు

తాము అధికారంలోకి రాగానే పంట రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన విధంగా రూ.17,869.22 కోట్ల పంట రుణాలను మాఫీ చేయడం ద్వారా 22,22,067 మంది రైతులను రుణ విముక్తులను చేసింది.  కేవలం 27 రోజుల వ్యవధిలో   రుణమాఫీ పంపిణీ  పూర్తి చేసింది.  స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం  చేయనంత స్వల్పకాలంలో,  ఇంత పెద్ద మొత్తంలో  పంట రుణాలను  మాఫీ చేసి కాంగ్రెస్​ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ,  రైతుసంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం,  రైతులకు  పెట్టుబడి సాయంగా  రూ.7,625.14 కోట్ల మొత్తాన్ని 69.86 లక్షల మంది రైతులకు బదిలీ చేసింది. ఈ సంవత్సర కాలంలో రైతు బీమా కింద కవరేజీని 41,02,850 నుంచి 42,15,670 మంది రైతులకు పెంచారు. లక్షకు పైగా రైతు కుటుంబాలు అదనంగా కవర్ అయ్యాయి. 

ALSO READ | భూసేకరణకు..ప్రజాభిప్రాయం అనివార్యం

రూ. 1455.17 కోట్లను ఎల్​ఐసీకి  ప్రీమియంగా ప్రభుత్వం చెల్లించింది. తద్వారా, ఈ  రైతు కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సౌకర్యం ఏర్పడింది. అన్ని మండలాల్లో వ్యవసాయ అధికారులు ఉండేలా 148 మంది వ్యవసాయ అధికారుల (ఏవోలు) నియామకం చేసింది. ఆయిల్ పామ్‌‌‌‌‌‌‌‌‌‌పై కస్టమ్ డ్యూటీని పునరుద్ధరించారని  చేసిన ప్రయత్నం వల్ల ఆయిల్ పామ్ రైతులకు ఆయిల్ పామ్ ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ (ఎఫ్​ఎఫ్​బీ) రేటులో  టన్నుకు రూ. 2000 లాభం చేకూరింది. ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనార్థం అశ్వారావుపేట ఆయిల్‌‌‌‌ఫెడ్ ఫ్యాక్టరీలో  క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం కూడా చేశారు. 

ఉద్యానవన శాఖను బలోపేతం చేసేందుకుగాను 18 మంది హార్టికల్చర్ ఆఫీసర్‌‌‌‌లను (హెచ్‌‌‌‌ఓలు) నియమించడం జరిగింది.  దీనితోపాటు, సన్న బియ్యానికి క్వింటాల్‌‌‌‌కు రూ.500 బోనస్​ను  అందించడం విజయవంతంగా జరుగుతోంది.  అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ ఏర్పాటు.  పాడిపరిశ్రమ కోసం తీసుకున్న చర్యల్లో భాగంగా, 172 మంది వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్​ల నియామకం పూర్తి చేయడం జరిగింది.  మరో 100 మంది నియామకం ప్రక్రియ  పురోగతిలో ఉంది.  రాష్ట్రంలో నిలిచిపోయిన నాలుగేండ్ల అనంతరం, ఆవులు, గేదెలకు ఫెర్టిలిటీ క్యాంప్స్ తిరిగి నిర్వహించడం జరిగింది. 

రైతుల నుంచి 20శాతం కాంట్రిబ్యూషన్ సేకరించి జీవాల బీమాను  ప్రారంభించారు. రాష్ట్రంలో నాణ్యమైన పాలను అందించే విజయా డైరీని 100 శాతం కంప్యూటరైజేషన్  చేయడం జరిగింది.  ఇందిరా మహిళా శక్తిలో భాగంగా  రాష్ట్రంలో  చేపల మార్కెటింగ్ కోసం రాష్ట్రంలోని 32 జిల్లాల్లో మహిళలకు 32 ఫిష్ స్టాళ్లు ఇవ్వడం జరిగింది.  

- కన్నెకంటి
వెంకట రమణ,
జాయింట్ డైరెక్టర్, 
సమాచార పౌరసంబంధాల శాఖ,