ఉమ్మడి మెదక్ ​జిల్లాలో వైభవంగా కార్తీక పౌర్ణమి

వెలుగు, న్యూస్​నెట్​వర్క్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి మెదక్​జిల్లాలోని ఆలయాలు శుక్రవారం భక్తులతో కిటకిటలాడాయి. కొమురవెల్లి మల్లన్న ఆలయంలో దీపోత్సవం నిర్వహించారు. పటాన్​చెరు మండలం ఇస్నాపూర్ జీపీ పరిధిలో మాజీ సర్పంచ్,ఎంపీటీసీ బాలమణి ఏర్పాటు చేసిన దీపోత్సవ కార్యక్రమానికి టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, నీలం మధు హాజరై దీపాలు వెలిగించారు. ఏడుపాయల వనదుర్గామాత ఆలయం దీపాల వెలుగుల్లో మెరిసిపోతుంది. శివ్వంపేట మండల కేంద్రంలోని భగలాముఖి శక్తిపీఠం ఆలయంలో, చిన్న గొట్టి ముక్కుల సమీపంలోని చాకరి మెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ నెలకొంది.