Temba Bavuma: కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అద్భుతం.. టెస్ట్ క్రికెట్‌లో దూసుకెళ్తున్న బవుమా

శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా అద్భుతంగా రాణించాడు. ఓ వైపు కెప్టెన్ గా.. మరో వైపు బ్యాటర్ గా రాణిస్తూ సఫారీలకు అద్భుతమైన విజయాలను అందిస్తున్నాడు. ఈ సిరీస్ లో బవుమా బ్యాటింగ్ ఎంత ప్రశంసించినా తక్కువే. ఆడిన నాలుగు ఇన్నింగ్స్ ల్లో పట్టుదల చూపించాడు. డర్బన్‌లోని వేదికగా కింగ్స్‌మీడ్‌లో జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 201 బంతుల్లో 9 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకున్న ఈ సఫారీ కెప్టెన్ కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు.

బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై తొలి ఇన్నింగ్స్ లో 70 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత గెబార్హ వేదికగా జరిగిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో  హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్ లో 78 పరుగులు.. రెండో ఇన్నింగ్స్ లో 68 పరుగులు చేశాడు. సిరీస్ మొత్తం నిలకడగా రాణించిన ఈ సౌతాఫ్రికా కెప్టెన్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. మరోవైపు కెప్టెన్సీలోనూ తన దూకుడుని చూపించి జట్టుకు విజయాన్ని అందించాడు.    

ALSO READ | IND vs AUS: ట్రావిస్ హెడ్‌తో గొడవ.. సిరాజ్‌పై ఐసీసీ చర్యలు

బవుమా కెప్టెన్సీ చేపట్టిన తర్వాత సౌతాఫ్రికా ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు. 7 టెస్టుల్లో కెప్టెన్సీ చేస్తే  జట్టు  సాధించింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. బవుమాను చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం చేస్తూ ఉంటారు. అతను ఆటకు పనికిరాడని.. కెప్టెన్సీ అనవసరంగా ఇచ్చారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఒకవేళ అతను ఆడకపోతే ట్రోల్స్, మీమ్స్ చేయడానికి రెడీగా ఉంటారు. 2023 వన్డే వరల్డ్ కప్ లో బవుమా చెత్త బ్యాటింగ్ తీరుపై చాలా విమర్శలు వచ్చాయి. అయితే వీటన్నిటికీ బవుమా చెక్ పెట్టాడు. నాలుగు ఇన్నింగ్స్ లో అద్భుతంగా ఆడుతూ కెప్టెన్సీకి తాను అర్హుడేనని నిరూపించుకున్నాడు. 

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టాప్ 

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా దూసుకెళ్తుంది. ఏకంగా అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. సోమవారం (డిసెంబర్ 9) శ్రీలంపై 109 పరుగుల భారీ విజయం సాధించడంతో ఆస్ట్రేలియాను ధాటి టాప్ లో కి వెళ్ళింది. ఐదో రోజు 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 238 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా  ప్రస్తుతం సౌతాఫ్రికా 63.33  పీటీసీతో టాప్ ప్లేస్‌‌కు చేరుకోగా..ఆస్ట్రేలియా 60.71 పీటీసీతో  రెండో స్థానానికి పరిమితమైంది.