IND vs SA 3rd T20I: సౌతాఫ్రికాపై దంచికొట్టిన తెలుగు కుర్రాడు.. 51 బంతుల్లోనే సెంచరీ

టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ సౌతాఫ్రికాపై దుమ్మురేపాడు.సెంచూరియన్ వేదికగా జరుగుతోన్న మూడో టీ20లో సెంచరీతో చెలరేగాడు. 51 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులు బాది అంతర్జాతీయ టీ20 క్రికెట్‎లో తొలి సెంచరీ నమోదు చేశాడు. 56 బంతుల్లో 107 పరుగులు చేసి నాటౌట్‎గా నిలిచాడు. తిలక్ వర్మ పరుగుల వరద పారించడంతో మూడో టీ20లో టీమిండియా భారీ స్కోర్ చేసింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‎కు చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. తిలక్ వర్మ సెంచరీతో (107) మెరవగా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ (50) తో రాణించాడు. హార్ధిక్ పాండ్యా 18 పరుగులు చేయగా.. అరంగ్రేట ప్లేయర్ రమన్ దీప్ సింగ్ చివర్లో 15 పరుగులు బాదాడు. 

ALSO READ | IND vs SA 3rd T20I: సఫారీలను చితక్కొట్టాడు: తిలక్ వర్మ మెరుపు సెంచరీతో భారత్ భారీ స్కోర్

సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, ఆండిలే సిమెలన్ చెరో రెండు వికెట్లు తీయగా.. మార్కో జెన్సన్ ఒక వికెట్ సాధించాడు. అనంతరం సౌతాఫ్రికా 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది. నాలుగు మ్యాచుల సిరీస్‎లో ఇండియా, సౌతాఫ్రికా చెరో మ్యాచ్‎లో విజయం సాధించగా.. మూడో మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ రేసులో ముందుకు వెళ్లాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.