న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న తెలుగు జవాన్ రెడ్డప్పనాయుడు నిన్న రాత్రి చలికి తీవ్రతకు తట్టుకోలేక కుప్పకూలి చనిపోయాడు. విధుల్లో ఉన్న సమయంలో చలితీవ్రతకు తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిన రెడ్డప్పనాయుడును సహచర సైనికులు హుటాహుటిన ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకునేలోపే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. చనిపోయిన రెడ్డప్పనాయుడు స్వస్థలం ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గడ్డక్రిందపల్లి. 1993లో జవాన్ గా ఆర్మీలో చేరిన రెడ్డప్పకు భార్య రెడ్డమ్మ, కుమారుడు సాత్విక్, కుమార్తె నిశిత ఉన్నారు. సంక్రాంతి పండుగకు సెలవు తీసుకుని ఊరికి వస్తానన్న మనిషి కొద్దిసేపటికే చనిపోయినట్లు తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చుట్టుపక్కల అందరికీ చిరపరిచితుడైన జవాన్ మృతిచెండడంతో గడ్డక్రిందపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
for more News..
కరోనా లాక్‌డౌన్ టైమ్ కుటుంబాలకు మేలే చేసింది
హైదరాబాద్‌లో చెట్టు కొట్టేసినందుకు రూ. 10 వేల ఫైన్
ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీ ప్రొడక్ట్‌ల కోసం కొత్త ఈ-కామర్స్ పోర్టల్
