వ్యవసాయేతర భూమిగా మార్చండి

  • అధికారులకు నటుడు అలీ దరఖాస్తు 
  • అనుమతి పత్రాలు అందజేసిన తహసీల్దార్​

వికారాబాద్, వెలుగు: వికారాబాద్​జిల్లా నవాబ్​పేట మండలం ఏక్​మామిడిలోని ఫాంహౌస్​లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని సినీ నటుడు అలీకి ఆదివారం రెవెన్యూ అధికారులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అలీ పేరిట వ్యవసాయ భూమి ఉండగా, అందులో నిర్మాణాలు చేపట్టడం రూల్స్​కు విరుద్ధమని అధికారులు పనులను అడ్డుకున్నారు.

దీంతో అలీ సోమవారం నవాబుపేట తహసీల్దార్ ఆఫీసుకు వచ్చారు. ఏక్​మామిడి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 340, 341, 344, 345లో ఉన్న 5.22 గుంటల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలని దరఖాస్తు చేసుకున్నారు. దీంతో తహసీల్దార్ జయరాం అనుమతి ఇస్తూ ప్రొసీడింగ్స్​ను అలీకి అందజేశారు.