♦ దేశంలో సీఏఏ కు వ్యతిరేకంగా ఆందోళనలు
♦ సున్నితమైన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్
♦ సోషల్ మీడియాపై ఆంక్షలు
♦ తగ్గిన సోషల్ మీడియా వినియోగం
♦ భారీ నష్టాల్ని చవిచూస్తున్న టెలికాం సంస్థలు
సిటిజన్ షిప్ బిల్లు(సీఏఏ), ఆర్టికల్ 370తో టెలికామ్ సంస్థలు లబోదిబోమంటున్నాయి.
ఇతర దేశాల కంటే మనదేశంలో ఫేస్ బుక్, వాట్సాప్ వినియోగించేవారిలో ప్రదమ స్థానంలో ఉన్నారు. అయితే తాజాగా దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడంతో వినియోగం తగ్గిపోయింది. దీంతో టెలికామ్ సంస్థలు అప్పుల ఊబిలో కురుకుపోతున్నట్లు తెలుస్తోంది. సీఏఏ, ఆర్టికల్ 370 వల్ల టెలికామ్ సంస్థలు గంటకు $350,000 డాలర్ల నష్టాన్ని చవిచూస్తున్నట్లు లాబీ గ్రూప్ ప్రకటించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగించే దేశాల్లో భారత్ ప్రధమ స్థానంలో ఉంది. నెలకు సుమారు యావరేజ్ గా 9.8గిగా బైట్ ను వినియోగిస్తున్నారని టెలికాం ఎక్విప్ మెంట్ తయారీ సంస్థ ఎరిక్సన్ ప్రకటించింది.
కేంద్రం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చే ముస్లిమేతరులకు పౌరసత్వం ఇచ్చే చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. దీంతో ముస్లీంలకు ఈ చట్టం వ్యతిరేకంగా ఉందంటూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఈ ఆందోళనలు అరికట్టేందుకు కేంద్రం భారీ భద్రతా బలగాల్ని మోహరించింది.
గత వారం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్, టెక్స్ట్ మెసేజింగ్ సేవలను నిలిపివేసింది. వివాదాస్పద కాశ్మీర్ నుండి ఈశాన్య వరకు విస్తరించి ఉన్న ప్రాంతాలలో కమ్యూనికేషన్ సేవలు నిలిపివేసింది.
డిజిటల్ హక్కుల సంస్థ యాక్సెస్ నౌ ప్రకారం భారత కాశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలు 140 రోజులకు పైగా నిలిపివేయబడ్డాయని ప్రకటించింది.
తాజాగా శుక్రవారం, నార్త్ ఉత్తర ప్రదేశ్ లో 18 జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్‌ను మూసివేయాలని కేంద్రం ఆదేశించినట్లు టెలికాం పరిశ్రమ వర్గాలు రాయిటర్స్‌కు తెలిపాయి.
మరోవైపు టెలికాం కంపెనీల నష్టాలపై సెల్యూలర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా డైరక్టర్ జనరల్ రాజన్ మాథ్యూ మాట్లాడుతూ..నష్టాలపై వివరణ ఇవ్వాలని టెలికాం సంస్థలైన ఎయిరిటల్ , జియో, ఒడాఫోన్,ఐడియా సంస్థలకు మెయిల్స్ పంపామన్నారు. కానీ ఇంతవరకు సదరు సంస్థలు స్పందించలేదని రాజన్ తెలిపారు. వివరణ వచ్చిన వెంటనే టెలికాం నష్టాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు.
