2 లక్షల ఫోన్ నెంబర్లు బ్లాక్ .. ఎక్కడ.. ఎందుకు అంటే

2 లక్షల ఫోన్ నెంబర్లు బ్లాక్ .. ఎక్కడ.. ఎందుకు అంటే

బీహార్, జార్ఖండ్‌ లలో టెలికాం శాఖ భారీగా మొబైల్ నంబర్‌లను డీయాక్టివేట్ చేసింది. టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ (DoT) ఏప్రిల్ నెలలో రెండు రాష్ట్రాలలో మొత్తం 2.25 లక్షలకు పైగా మొబైల్ ఫోన్ నంబర్‌లను డీయాక్టివేట్ చేసింది. ఎందుకంటే ఇందులో చాలా సిమ్ కార్డ్‌లు నకిలీ పత్రాలతో తీసుకున్నారు. దీంతో అధికారులు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లును బ్లాక్ లిస్ట్ లో చేర్చారు. పలు కంపెనీలు సిమ్ కార్డ్‌లను జారీ చేసేటప్పుడు చట్టవిరుద్ధమైన పద్ధతులకు పాల్పడినట్లు ప్రాథమికంగా వెల్లడైంది.

టెలికాం శాఖ ప్రత్యేక డైరెక్టర్ జనరల్ తెలిపిన వివరాల ప్రకారం.. "ఏప్రిల్ 2023 నెలలోనే, రెండు రాష్ట్రాల్లో మొత్తం 2.25 లక్షలకు పైగా మొబైల్ నంబర్లు డీయాక్టివేట్ చేయబడ్డాయి. ఎక్కువగా చట్టవిరుద్ధమైన,అనైతిక మార్గాల ద్వారా సిమ్ కార్డులు తీసుకున్నారు. అంతేకాకుండా, సిమ్ కార్డులను జారీ చేసేటప్పుడు మోసపూరితమైన పద్ధతులకు పాల్పడినట్లు గుర్తించడంతో 517 PoS బ్లాక్‌ లిస్ట్ చేయబడింది.

టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు మోసపూరిత PoS, చందాదారులపై చట్టపరమైన చర్యలను తీసుకోవడం సిద్దమైయ్యారు. జార్ఖండ్, బీహార్‌ ప్రభుత్వాలు పలు జిల్లాల్లో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు ప్రకటన తెలిపింది. ఈ వ్యవహరంలో తగిన చర్య తీసుకుంటామని రెండు రాష్ట్ర పోలీసులు వెల్లడించారు.