తెలంగాణకు చెందిన పవర్ లిఫ్టర్ సుకన్యకు సిల్వర్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కామన్వెల్త్ పవర్‌‌‌‌‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో తెలంగాణకు చెందిన పవర్ లిఫ్టర్ తేజావత్‌‌‌‌ సుకన్య సత్తా చాటింది. సౌతాఫ్రికాలోని సన్‌‌‌‌సిటీలో జరుగుతున్న ఈ టోర్నీలో  సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన  విమెన్స్‌‌‌‌ 76 కేటగిరీ ఫైనల్లో  సుకన్య  107.5 కేజీల బరువెత్తి రెండో స్థానంతో రజతం గెలిచింది. కర్నాటకకు చెందిన బీఎం వైశాలి 112.5 కేజీలతో స్వర్ణం  నెగ్గగా,  నార్తర్న్ ఐర్లాండ్ లిఫ్టర్  బెలా ఎలెనా  100 కేజీలతో కాంస్యం  పతకం ఖాతాలో వేసుకుంది.