TG TET Hall Ticket 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల

హైదరాబాద్​:   టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్​)  హాల్ టికెట్లు విడుదలయ్యాయి.   ఇటీవల ప్రకటించిన షెడ్యూల్​ప్రకారం..  జనవరి 2 నుంచి 20 వరకు జరగనున్న టెట్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇవాళ అధికారులు విడుదల చేశారు.  ఇవాళ్టి  అభ్యర్థులు వారి హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ లో ఉంచారు.  అభ్యర్థులు తమ జర్నల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్‌ చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

ALSO READ | ఎన్హెచ్ఆర్సీ చైర్​పర్సన్గా వి.రామసుబ్రమణియన్

ఈ ఎగ్జామ్స్‌కు 2,48,172 మంది అభ్యర్థులు  అప్లై చేసుకున్నారు. విద్యాశాఖ ఇప్పటికే ప్రక‌టించిన షెడ్యూల్ ప్రకారం.. 2025 జనవరి 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు. రెండు సెషన్లుగా పరీక్షలు ఉండనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే  టీజీ టెట్‌ సిలబస్‌ కూడా విడుదల చేసింది.