ఏప్రిల్ 7 నుంచి బడి పిల్లలకు ఎగ్జామ్స్..ఫిబ్రవరి11 నుంచి టెన్త్ ప్రీ ఫైనల్స్

ఏప్రిల్ 7 నుంచి  బడి పిల్లలకు ఎగ్జామ్స్..ఫిబ్రవరి11 నుంచి  టెన్త్ ప్రీ ఫైనల్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న స్టూడెంట్లకు వచ్చే ఏడాది  ఏప్రిల్ 7–16 వరకు యాన్యువల్​ ఎగ్జామ్స్​నిర్వహించనున్నట్లు ఎస్సీఈఆర్టీ తెలిపింది. ఈ మేరకు సోమవారం షెడ్యూల్​విడుదల చేసింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు… 6, 7 తరగతులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 12:45 గంటల వరకు ఎగ్జామ్స్​ ఉంటాయి. 8వ తరగతికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అయితే 8న జనరల్ సైన్స్ పేపర్–1 ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు, 16న ఇంగ్లిష్ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుంది. ఇక 9వ తరగతికి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పేపర్​–1 ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం12:45 వరకు, పేపర్​–2 మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:45 వరకు నిర్వహించనున్నారు. అలాగే16న సెకండ్​లాంగ్వేజీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుంది. 18న రిజల్ట్స్ ప్రకటించాలని, 20న పేరెంట్స్​తో సమావేశం నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. అదే విధంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11 నుంచి మార్చి 25 వరకు పదో తరగతి ప్రీ ఫైనల్‌‌ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్‌‌ విడుదల చేశారు.