హ్యాట్సాఫ్ తెలంగాణ పోలీస్ : జీరో క్రైం రేటుతో న్యూఇయర్ సెలబ్రేషన్స్

తెలంగాణ పోలీసులు ఫిక్స్ అయ్యారు.. ఫిక్స్ చేశారు.. ఇంకేముందీ ఫర్ ఫెక్ట్ ప్లానింగ్ తో.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను విజయవంతం చేశారు. ఫస్ట్ టైం.. జీరో క్రైం రేటుతో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకులను ప్రశాంతంగా జరిగే విధంగా.. కట్టుదిట్టమైన భద్రతతో సెక్సెస్ అయ్యారు పోలీసులు. 

ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో అయితే న్యూ క్రైం.. జీరో యాక్సిడెంట్స్.. అవును.. హైదరాబాద్ సిటీలోని కోటికి పైగా ఉన్న జనం.. ఒకే రోజు.. ఒకేసారి వేడుకలు చేసుకుంటారు.. వేలాది ఈవెంట్స్ జరిగాయి. హోటల్స్, బార్లు, పబ్స్, ఫంక్షన్ హాల్స్.. ఇలా అన్ని ఈవెంట్స్ సమాచారం ముందుగా సేకరించిన తెలంగాణ పోలీసులు.. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విధించారు. పార్టీ ఏదైనా సరే.. రాత్రి 12 గంటల 30 నిమిషాలకు ముగించాలని గట్టిగా ఆర్డర్స్ వేశారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని న్యూ ఇయర్ వేడుకలు 12 గంటల 30 నిమిషాలకు క్లోజ్ అయ్యాయి.. దీంతో పార్టీలకు హాజరైన వారు అర్థరాత్రి ఒంటి గంటకే ఇళ్ల చేరారు. 

ఇదే సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కఠినంగా అమలు చేశారు. వారం ముందు నుంచే కఠిన నిబంధనలు అని స్పష్టం చేయటంతో.. పార్టీల్లో మందు కొట్టిన వారు వాహనాలు నడపటానికి భయపడ్డారు. ఇదే సమయంలో అన్ని ఫ్లై ఓవర్లు మూసివేయటంతో యాక్సిడెంట్స్ అస్సలు లేవు. 

ALSO READ | గ్రేప్స్, ఐస్, కండోమ్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఇంకా మరెన్నో.. న్యూ ఇయర్ ఆన్ లైన్ ఆర్డర్స్ ఇవే ఎక్కువట..!

ఎక్కడెక్కడ మాస్ గేదరింగ్.. పబ్లిక్ న్యూసెన్స్ జరిగే అవకాశం ఉందో.. ఆయా ప్రాంతాల్లో ముందస్తుగానే పోలీసులు మోహరించారు. భద్రత పెంచారు. దీంతో ఆకతాయిలు ఎవరూ అల్లరి చేయటానికి వీల్లేకుండా సైలెంట్ అయ్యారు. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా పోలీసులు మోహరించటంతో.. ఆకతాయిల చేష్టలకు అవకాశం లేకుండా పోయింది. తాగి బండ్లపై వేగంగా వెళ్లే వారు స్లో అయ్యారు.. అడ్డదిడ్డంగా ర్యాష్ డ్రైవింగ్ చేసే కుర్రోళ్లు కంట్రోల్ అయ్యారు. దీంతో యాక్సిడెంట్స్ లేవు.. అరుపులు లేవు.. అంతా ప్రశాంతంగా జరిగింది.

గతంలో ఎప్పుడూ లేని విధంగా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జీరో క్రైం రేటుతో.. జీరో యాక్సిడెంట్స్ తో 2025 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరగటం.. పోలీసుల పనితీరుకు హ్యాట్సాప్ అంటున్నారు జనం..