ఇథనాల్  కంపెనీని రద్దు చేయాలి :  ప్రజా జేఏసీ సభ్యులు

నర్వ, వెలుగు: ప్రభుత్వం సింథటిక్​ కెమికల్స్​ పర్మిషన్​ ఇవ్వకుండా, ఇథనాల్​ కంపెనీని రద్దు చేయాలని తెలంగాణ పీపుల్స్​ ప్రజా జేఏసీ సభ్యులు కోరారు. ఇథనాల్  కంపెనీకి అనుసంధానంగా సింథటిక్  కెమికల్స్  ఉత్పత్తికి కేంద్ర పర్యావరణశాఖ పర్మిషన్​ కోసం కంపెనీ యజమానం ప్రయత్నిస్తోందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సింథటిక్  కెమికల్స్ తో జరిగే నష్టాన్ని వివరించారు. శుక్రవారం చిత్తనూర్  ఇథనాల్  కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు చిత్తనూర్, జిన్నారం, ఎక్లాస్​పూర్, ఉండేకోడ్, పాతర్చేడ్  గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

టీపీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్  కన్నెగంటి రవి, ఇథనాల్  కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు బండారి లక్ష్మయ్య, చైతన్య మహిళా సంఘం నాయకులు శ్రీదేవి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇథనాల్​ కంపెనీని రద్దు చేయాలని కోరారు. జె చక్రవర్తి, కేజీ రామారావు, మహదేవ్, రాంచందర్, లింగమయ్య, మధు పాల్గొన్నారు