నరేందర్​రెడ్డికి రెండు రోజుల పోలీస్ కస్టడీ

  • అనుమతించిన కొడంగల్ కోర్టు

కొడంగల్, వెలుగు: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డిని రెండు రోజుల పోలీస్​ కస్టడీకి కొడంగల్​ కోర్ట్​ అనుమతించింది. లగచర్ల గటనలో ఏ1గా ఉన్న నరేందర్​రెడ్డిని కస్టడీకి కోరుతూ పోలీసులు పబ్లిక్​ ప్రాసీక్యూటర్​ ద్వారా పిటీషన్​ దాఖలు చేశారు. విచారణ జరిపిన కొడంగల్ జూనియర్​సివిల్​జడ్జ్​తీర్పును రిజర్వ్​చేశారు. రెండు రోజుల(శనివారం, ఆదివారం) కస్టడీకి అనుమతించింది. దాంతో నరేందర్​రెడ్డిని పోలీసులు చర్లపల్లి జైలు నుంచి వికారాబాద్​తరలించన్నారు.