లగచర్లకు జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్  నాయక్

వికారాబాద్, వెలుగు: వికారాబాద్  జిల్లా దుద్యాల మండలంలోని లగచర్ల గ్రామానికి జాతీయ ఎస్టీ కమిషన్  మెంబర్  జాటోతు హుస్సేన్  నాయక్  సోమవారం రానున్నారు. ఆయన ఉదయం 9 గంటలకు హైదరాబాద్  నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు లగచర్ల గ్రామానికి చేరుకుంటారు. లగచర్ల గ్రామంలో గిరిజన సంఘాల నాయకులు, గిరిజనులు, గ్రామస్తులతో మాట్లాడుతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు సంగారెడ్డి జైలుకు వెళ్లి రిమాండ్​లో ఉన్న లగచర్ల గ్రామస్తులను కలవడానికి బయలుదేరుతారు. అక్కడ గంట పాటు లగచర్ల నిందితులతో మాట్లాడుతారు. సాయంత్రం 5 గంటలకు సంగారెడ్డి నుంచి తిరిగి హైదరాబాద్​ బయలుదేరుతారు. 

జాతీయ కమిషన్లకు​ ఫిర్యాదు

లగచర్ల ఘటనపై రైతులు జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లను ఆశ్రయించారు. ఆదివారం రాత్రి ఢిల్లీలో మూడు కమిషన్లను కలిసి ఫిర్యాదు చేశారు. ఫార్మా పరిశ్రమ భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన తమపై పోలీసులు  జరిపిన దౌర్జన్యంపై విచారణ జరపాలని కోరారు. వేధింపులు, బలవంతంగా భూమి లాక్కొనేందుకు యత్నం, పోలీసుల అసభ్య ప్రవర్తన, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై ఎంక్వైరీ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.