ఆర్టీసీలో సర్వీస్ కేసుల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు: మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్టీసీ ఉద్యోగుల సర్వీస్ నిమిత్తం వివిధ కేసుల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసినట్లు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. లేబర్ ఎంప్లాయిమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ ఛైర్మన్ గా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్,  ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య.. సభ్యులుగా ఈ త్రిసభ్య కమిటీ పనిచేయనుంది. 

గతంలో ఆర్టీసీలో విధుల్లో ఉన్న ఉద్యోగులపై నమోదైన సర్వీస్  రిమూవల్ కేసుల పరిశీలనపై ఈ కమిటీ పనిచేయనుంది. ఇప్పటికే ప్రజావాణిలో నమోదైన ఆర్టీసీకి  సంబంధించిన సర్వీస్ రిమూవల్ తదితర కేసుల ఫిర్యాదులను ఈ త్రిసభ్య కమిటీ రివ్యూ చేయనుంది. కేసులో ఉన్న మెరిట్స్ ను బట్టి ఆర్టీసీ యాజమాన్యానికి రెకమెండ్ చేయనుంది..