గ్రేట్ : నాలుకతో స్పీడుగా తిరిగే ఫ్యాన్ బ్లేడ్ లను ఆపాడు.. గిన్నిస్ రికార్డ్ సాధించాడు..

ప్రపంచంలో చాలా మంది రికార్డులు సృష్టించడానికి ఏవేవో చేస్తుంటారు.  అలా కొందరికి గుర్తింపు వచ్చి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదిస్తారు.  వివిధ రంగాల్లో ప్రతిభ కనపరచిన వారికి  గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లను అందజేస్తుంటారు.  అలాగే ఇప్పుడు తెలంగాణకు చెందిన క్రాంతి కుమార్ అనే వ్యక్తి గిన్నెస్ బుక్ లో స్థానం సంపాదించాడు.

క్రాంతి డ్రిల్ మ్యాన్ వ్యక్తి తన నాలుకతో స్పీడుగా తిరిగే ఎలక్ట్రికల్ ఫ్యాన్ బ్లేడ్లను ఆపాడు.  దీనికి సంబంధించిన వీడియోను గిన్నెస్ బుక్ ఆప్ రికార్డ్  సోషల్ మీడియాలో షేర్ చేసింది.  ఈ వీడియోలో  వేగంగా తిరుగున్న ఫ్యాన్ రెక్కలను నాలుకతో ఆపాడు. ఇలా కొన్నింటిని ఆపిన తరువాత నాలుకకు గాయమైనా అతను తన ప్రయత్నాన్ని ఆపలేదు.  . ఈ క్రమంలోనే అతను గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ ను సాధించాడు. దీంతో అతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ సర్టిఫికేట్‌ను అందించింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను ఈ ఘనత సాధించేందుకు ఏళ్ల తరబడి కష్టపడి సాధన చేశానని క్రాంతి తెలిపారు.

సూర్యపేటకు చెందిన క్రాంతి ఈ వీడియోలో రంగు రంగుల షర్ట్ తో ఉన్నాడు.   ఈ రికార్డ్ గురించి క్రాంతి మాట్లాడుతూ.. తాను  ఇప్పటికి నాలుగు గిన్నిస్ రికార్డులను సాధించానని చెప్పుకొచ్చారు,  తన జీవితంలో అద్భుతమైన ఘట్టం అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇప్పటి వరకు ( వార్త రాసే  సమయం వరకు) 60 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీనిపై స్పందించిన నెటిజన్లు ఇలాంటి రికార్డులు సాధించాల్సిన అవసరం ఏమిటని రాసుకొచ్చారు.  మరి కొందరు ఆయన నాలుకకు ఏమైందని ప్రశ్నించారు. ఇంకొకరు మీలో ఇంత టాలెంట్ ఉందని మీకెలా తెలుసని రాశారు. .. కొంతమంది ఆయన ప్రతిభను ప్రశించగా.. మరికొంతమంది.. ఇలాంటివి ప్రమాదకరమైన సాహసాలు చేయవద్దని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.