కర్నూలులో తెలంగాణ మద్యం పట్టివేత

కర్నూలులో తెలంగాణ మద్యం పట్టివేత

ఏపీలో మద్యం ధరలు భారీగా పెంచడంతో.. చుట్టు పక్కల రాష్ర్టాల నుండి మద్యం అక్రమంగా తరలిస్తున్నారు. ప్రతి రోజు తెలంగాణ సరిహద్దు నుండి అనేక మార్గాల్లో తరలిస్తున్నారు. ఎంత పోలీసు బందోబస్తు పెట్టినా వారి కళ్లు గప్పి తరలిస్తున్నారు. కర్నూలు జిల్లా పోలీసులు జరిపిన తనిఖీల్లో తెలంగాణ రాష్ర్ట మద్యం భారీగా పట్టుబడింది. గురువారం ఒక్క రోజే 1676 ఫుల్ బాటిల్స్.. 545 లీటర్ల నాటుసారా పట్టుబడింది. సరిహద్దుల్లో పోలీసు నిఘా కళ్లు కప్పి ఎలా వస్తోందనేది అంతుబట్టడంలేదంటున్నారు కర్నూలు పోలీసులు. తెలంగాణ మద్యం రెండు ఫుల్ బాటిల్స్ తీసుకుని.. ఏపీకి వెళితే.. వెయ్యి రూపాయలకుపైగానే వస్తుందనే ఆశతో…  చాలా సులువగా డబ్బు సంపాదించొచ్చు అనే ఆశతో..నూనూగు మీసాల యువకులు పక్కదోవ పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.