హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో మూడు కీలక బిల్లులు పాస్ అయ్యాయి. మంగళవారం లంచ్‌బ్రేక్ తర్వాత తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్వర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల సవరణ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. లగచర్ల రైతుకు బేడీలు వేసిన ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌తో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనలు చేయగా.. నిరసనల మధ్యే మూడు బిల్లులను సభ ఆమోదించింది.
అలాగే టూరిజం పాలసీకి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. స్పోర్ట్స్వర్సిటీ బిల్లును మంత్రి సురేఖ, వర్సిటీల చట్ట సవరణ బిల్లును మంత్రి జూపల్లి, జీఎస్టీ సవరణ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. స్పోర్ట్స్వర్సిటీ, వర్సిటీల చట్ట సవరణ బిల్లుల్లో పలు సవరణలు ప్రతిపా దించినా అవి తిరస్కరణకు గురయ్యాయి. స్పోర్ట్స్వర్సిటీకి చాన్స్‌లర్‌గా సీఎం కాకుండా గవర్నర్‌ను నియమించాలని బీజేపీ ఎమ్మెల్యే హరీశ్‌బాబు సూచించగా.. తిరస్కరించారు.