
కావాల్సినవి:
మఖానా: ఒక కప్పు
బొంబాయి రవ్వ : అర కప్పు
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
ఆవాలు : అర టీస్పూన్
కరివేపాకు : కొంచెం
పచ్చిమిర్చి : రెండు
ఎండు మిర్చి తునకలు, వెల్లుల్లి - అల్లం పేస్ట్ : అర టీస్పూన్
ఉల్లిగడ్డ, క్యాప్సికమ్, క్యారెట్ : ఒక్కోటి
నీళ్లు : సరిపడా
తయారీ : మఖానాని మిక్సీజార్లో వేసి పొడి పట్టాలి. నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యాప్సికమ్, క్యారెట్ తరుగు, ఎండు మిర్చి తునకలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి. అందులో నీళ్లు పోసి, మఖానా పొడి వేసి కలపాలి. రెండు నిమిషాలు ఉడికించి, ముద్ద చేసి చపాతీ కర్రతో వత్తాలి. తర్వాత త్రికోణాకారంలో వాటిని కట్ చేసి వేడి నూనెలో వేగించాలి.