
కావాల్సినవి :
బొంబాయి రవ్వ : అర కప్పు
మిరియాల పొడి : అర టీస్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్
ఎండు మిర్చి : రెండు
కరివేపాకు : కొద్దిగా
నీళ్లు : ముప్పావు కప్పు
నూనె, ఉప్పు : సరిపడా
ఆలుగడ్డలు (ఉడికించి) : మూడు
తయారీ : పాన్లో నూనె వేడి చేసి, కరివేపాకు, ఎండు మిర్చి (గింజలు తీసేసి), అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేగించాలి. అందులో నీళ్లు పోసి రెండు నిమిషాలు కాగబెట్టాలి. ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. తర్వాత బొంబాయి రవ్వ కూడా వేసి గరిటెతో తిప్పుతూ ఉడికించాలి. అందులోనే ఆలుగడ్డలు వేసి కలపాలి. కాసేపు ఆ మిశ్రమాన్ని చల్లారబెట్టాలి. చల్లారాక, చపాతీలా వత్తి, చాకుతో కట్ చేయాలి. వాటిని వేడి నూనెలో వేసి బాగా వేగిస్తే బొంబాయి రవ్వ చిప్స్ రెడీ.