తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఇంటర్మీడియెట్ పబ్లిక్ ఎగ్జామ్స్ (IPE) బోర్డు సోమవారం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది.  ప్రాక్టికల్స్  ఫిబ్రవరి 3 నుండి 22 వరకు జరగనున్నాయి. 

అదే విధంగా పబ్లిక్ ఎగ్జామ్స్ మార్చి 5 నుండి 25 వరకు జరగనున్నాయి. అయితే ఈ షెడ్యూల్ ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు కూడా వర్తించనుందని, ప్రత్యేకంగా విడుదల చేయనున్నట్లు ఐపీఈ బోర్డు ప్రకటనలో తెలిపింది.

  • టైమింగ్స్:

ప్రాక్టికల్ ఎగ్జామ్స్ శని, ఆదివారాలు కలుపుకొని రెండు సెషన్లలో జరుగుతాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ (9:00 AM to 12:00 PM), అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్ (2:00 PM to 5:00PM) ఉంటుంది. 
ఇక రాత పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు (9:00 AM to 12:00 PM) ఒకే సెషన్ లో ఉంటాయి.