ఇతర రాష్ట్రాల్లో మెడిసిన్​చదివిన వారిని స్థానికులుగా పరిగణించాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌:  మెడికల్ పీజీ అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.  తెలంగాణ స్థానికత ఉండి ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ చదవినా, తెలంగాణ స్థానికత లేకుండా ఇక్కడ ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ చదవిన వారిని కూడా స్థానికులుగా పరిగణించాలని  ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.  ఈ మేరకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 140ని సవరించాలని గతంలోనే  ప్రభుత్వాన్ని ఆదేశించింది.  ఇందుకు సంబంధించిన ప్రభుత్వ జీఓను హైకోర్టు నిలిపివేసింది.  

ALSO READ | అందరూ కలవాల్సింది శ్రీతేజ్ను.. అల్లు అర్జున్ను కాదు: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

ప్రభుత్వ జీవోను సవాల్‌ చేస్తూ మెడికల్‌ పీజీ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. జీవో 140 ప్రకారం 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదవడంతోపాటు ఎంబీబీఎస్‌ కూడా ఇక్కడే పూర్తి చేసినవారికి తెలంగాణ స్థానికత కల్పిస్తారు. ఈ జీవో అమలును ప్రస్తుతం హైకోర్టు నిలిపివేసింది.