‘అలా ఎలా కూల్చేస్తారు..?’ ఖాజాగూడ చెరువులో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్: ఖాజాగూడా చెరువులో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ల్యాండ్ FTL పరిధిలో ఉన్నట్టు ఎలా చెప్తున్నారని, ఆధారాలు ఉన్నాయా అని హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ వద్ద అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని, FTL, బఫర్ జోన్ పరిధి తేల్చకుండా కూల్చివేతలు ఎలా చేస్తారని హైడ్రా తీరుపై హైకోర్టు మండిపడింది. కమిషనర్కి చెప్పి కూల్చివేతలు ఆపమని చెప్పండని, వినలేదంటే తాను ఎలా డీల్ చేయలో అలా చేస్తానని హైకోర్టు న్యాయమూర్తి హెచ్చరించారు.

ఇలాంటివి పునరావృతం అయితే కమిషనర్ రంగనాథ్పై సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. పిటిషనర్ కూడా GHMC పర్మిషన్ లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని, పిటిషనర్ వేసిన తాత్కాలిక ఫెన్సింగ్ కూడా 24 గంటల్లో పిటిషనరే తొలగించాలని హైకోర్టు ఆదేశించింది.

2024, డిసెంబర్ 31న ఖాజాగూడ చెరువు దగ్గర ఇదీ జరిగింది:
* ఇయర్ ఎండింగ్లో కూల్చివేతలతో హడలెత్తిస్తున్న హైడ్రా
* ఖాజాగూడ చెరువు బఫర్ జోన్ లో నిర్మించిన ఆక్రమణలు కూల్చివేత
* నాలుగు ఎకరాల్లో వేసిన ఫెన్సింగ్ తొలగింపు
* 20కి పైగా దుకాణాలను తొలగించిన హైడ్రా సిబ్బంది
* నోటీసు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారుల ఆగ్రహం
* భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు
* ఖాజాగూడా భగీరధమ్మ చెరువు ఆక్రమణలపై స్థానికుల ఫిర్యాదు
* స్థానికుల ఫిర్యాదులను పరిశీలించి ఆక్రమణల కూల్చివేత