మీడియాపై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై పోలీసులు అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే..ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ఉండేందుకు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసినందున పోలీసులు మోహన్ బాబును ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 10న రాత్రి జల్ పల్లిలోని మోహన్ బాబు హౌస్ దగ్గర కవరేజ్ కు వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడి జరిగింది .. మైకు లాక్కొని ఓ జర్నలిస్ట్ తలపై కొట్టగా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిన జర్నలిస్ట్ సంఘాలు, పలువురు రాజకీయ నాయకులు ఖండించారు. మోహన్ బాబు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశాయి.
ఫ్యామిలీ గొడవలు,జర్నలిస్టుపై దాడి ఘటనలో డిసెంబర్ 11న విచారణకు రావాలంటూ మోహన్ బాబుకు రాచకొండ పోలీసులు నోటీసులిచ్చారు. అయితే పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ మోహన్ బాబు హైకోర్టులో పిటిషన్ వేయగా..కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను డిసెంబర్ 24 కు వాయిదా వేసింది.
ALSO READ : నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్: వందల మంది పోలీసులతో భారీ భద్రత
జర్నలిస్ట్ పై దాడి ఘటనపై మీడియాను ఉద్దేశిస్తూ డిసెంబర్ 12న మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేశారు. మీడియాపై దాడి చేస్తానని తాను ఎన్నడూ అనుకోలేదన్న మోహన్ బాబు.. దాడి చేయడం తన తప్పేనని, తన ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. గాయపడ్డ జర్నలిస్ట్ తన కుటుంబంలో ఒకరిని, తమ్ముడు లాంటి వారని అన్నారు. జరిగిన ఘటనకు బాధపడుతున్నానని తెలిపారు. అతని భార్యాపిల్లలు ఎంత బాధపడుతున్నారో అని తాను ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
కుటుంబ సమస్యల్లో జోక్యమెందుకు..?
అదే సమయంలో దాడి ఘటనపై మోహన్ బాబు.. మీడియాకు పలు ప్రశ్నలు సంధించారు. ఇతరుల కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? అని ఆయన మీడియాను ప్రశ్నించారు. ప్రజలు, నాయకులు దీనిపై ఆలోచించాలని ఆడియోలో కోరారు. గత నాలుగు రోజులుగా పత్రికా చానెళ్లు, విలేకర్లు తన ఇంటి ముందు లైవ్ వ్యాన్లు పెట్టుకుని ఉండటం ఎంతవరకూ కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు.