తెలంగాణ గ్రామీణ బ్యాంకు IFSC కోడ్ మారింది.. చెక్ డిటెయిల్స్

దేశంలోని అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ (Telangana Grameena Bank) ఒకటి. అయితే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ (APGVB) లో ఉన్న తెలంగాణలోని బ్యాంకు శాఖలన్నింటిని టీజీబీ(TGB)లో విలీనం చేశారు. జనవరి 1, 2025 నుంచి  విలీనం అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న కస్టమర్లకు సంబంధించి ఏటీఎం కార్డులు, చెక్ బుక్కులు, బ్యాంకింగ్ యాప్ లు, ఆన్ లైన్ బ్యాకింగ్ ఇలా చాలా కస్టమర్ సర్వీసుల్లో కొన్ని మార్పులు జరిగాయి. అవేంటో చూద్దాం..

  • పాత ఏటీఎం కార్డులు మార్చుకోవాలంటే.. ఖాతా ఉన్న శాఖలో సంప్రదించాలి. 
  • కొత్ చెక్ బుక్కులు ఇప్పటికే జారీ చేశారు. పాత చెక్ బుక్కులు ఉంటే.. బ్రాంచ్ లో అప్పగించాలి
  • చెక్కులు ఇదివరకే జారీ చేసి ఉంటే.. 90 రోజుల్లో చెల్లుబాటు అవుతాయి. 
  • ఇక మొబైల్ బ్యాంకింగ్ కు సంబంధించి.. కస్టమర్లు ప్లేస్టోర్ లేదా యాపిల్ స్టో ర్ నుంచి TGB Mobile banking app ను డౌన్ చేసుకొని మరోసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ కు కస్టమర్లు www.tgbhyd.inను సందర్శించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను కొనసాగించొచ్చు.
  • RTGS, NEFT లావాదేవీలకు ఉపయోగించే IFSC కోడ్‌ కూడా మారింది. ఇకపై SBIN0RRDCGBను వినియోగించాలి.
  • టీజీబీ వాట్సాప్‌ బ్యాంకింగ్‌ అండ్‌ మిస్‌ కాల్‌ అలర్ట్‌ సేవల కోసం నంబర్‌ 92780 31313ను సంప్రదించాలి.

ALSO READ | SBI Deposit schemes: ఎస్బీఐలో కొత్త డిపాజిట్ స్కీములు