తిరుమల శ్రీవారి సన్నిధిలో గవర్నర్ తమిళిసై

తిరుమల శ్రీవారి సన్నిధిలో గవర్నర్ తమిళిసై

తెలంగాణ గవర్నర్  తమిళిసై సుందర రాజన్  ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు..నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసైకి టీటీడీ అదనపు ఇఓ ధర్మారెడ్డి పుష్ప గుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. రాత్రి తిరుమలలోనే బస చేసిన తెలంగాణ గవర్నర్ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి దర్శించుకొని ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ హోదాలో మొదటి సారిగా స్వామివారిని దర్శించుకోవడం జరిగిందన్నారు….తిరుమలలో సామాన్య భక్తులకోసం  టీటీడీ చేస్తున్న ఏర్పాట్ల అభినందనీయమన్నారు…. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియ చేశారు తెలంగాణ గవర్నర్ తమిళిసై.