ఐఏఎంసీకి ల్యాండ్ ఇవ్వడం కరెక్టే .. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదన

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని ఇంటర్నేషనల్‌‌‌‌ ఆర్బిట్రేషన్‌‌‌‌ అండ్‌‌‌‌ మీడియేషన్‌‌‌‌ సెంటర్‌‌‌‌ (ఐఏఎంసీ)కు ఐదు ఎకరాల భూమి కేటాయించడం సబబేనని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఐఏఎంసీ ప్రైవేట్‌‌‌‌ ట్రస్ట్​అని, దీనికి ప్రభుత్వం భూమి కేటాయించడం అన్యాయమని దాఖలైన రెండు పిల్స్‌‌‌‌ను జస్టిస్‌‌‌‌ కె లక్ష్మణ్,  జస్టిస్‌‌‌‌ కె సుజనాతో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ విచారించింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ ఎ.సుదర్శన్‌‌‌‌ రెడ్డి సోమవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. 

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హేతుబద్ధమేనని, రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, అందుకే రాష్ట్రం విధాన నిర్ణయం తీసుకుని భూమిని కేటాయించిందని చెప్పారు.  ఐఏఎంసీ తరఫున సీనియర్‌‌‌‌ న్యాయవాది దేశాయ్‌‌‌‌ ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సింగపూర్, దుబాయ్, యూకే, అమెరికా వంటి దేశాల్లో మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్‌‌‌‌ విధానాలకు మంచి ఆదరణ ఉందని, పురోగతిని సాధిస్తున్న మన దేశంలో కూడా ఆ విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా పడింది.