గొర్రెల స్కీమ్ డీడీల డబ్బులు వాపస్ : 295 మంది ఖాతాల్లోకి  రూ కోటి 29 లక్షలు జమ 

మక్తల్, వెలుగు : నారాయణపేట జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ స్కీమ్ లో భాగంగా డీడీలు కట్టిన వారికి నగదు వారి ఖాతాలో ప్రభుత్వం తిరిగి జమ చేసిందని జిల్లా గొర్రెల పెంపకదారుల సహకార సంఘం అధ్యక్షుడు నాగరాజు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..   295 మంది గొర్రెల పెంపకం దారులు ఒక్కొక్క రూ రూ. 43,750 చొప్పున మొత్తం రూ కోటి 29 లక్షలు డీడీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించామని తెలిపారు.

 ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో డీడీల నగదు  గొర్రెల కాపరుల ఖాతాల్లో జమ చేశారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ను ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో మాదాసి కురుమ సంఘం నాయకులు ముస్లాయిపల్లి రాజు, గౌరవాధ్యక్షులు శరణప్ప, ఉట్కూర్ మండల అధ్యక్షుడు లింగప్ప, గజలప్ప, అంజప్ప, రమేశ్, నర్సింహ  పాల్గొన్నారు.