మహిళకు ఆర్థిక తోడ్పాటు .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రూ.83.16 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

  • మహిళా శక్తి ప్రోగ్రాం ద్వారా 13 రకాల యూనిట్లు 
  • మహిళా సంఘాల్లోని సభ్యులు 12,016 మందికి ఉపాధి
  • రెండో విడత లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు

రాజన్న సిరిసిల్ల,వెలుగు: మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమల్లోకి తీసుకొస్తోంది. దీనిలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి కల్పించేందుకు మహిళ శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ.83.16కోట్లు మంజూరు చేసింది. పథకంలో భాగంగా 13 రకాల యూనిట్లు మంజూరు చేశారు. వీటి ద్వారా ఉమ్మడి జిల్లాలో సుమారు 12,016 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. వీటితోపాటు బ్యాంక్, స్త్రీ నిధి రుణాలు అందిస్తున్నారు. 

యూనిట్ల గ్రౌండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి

 మహిళలకు ఉపాధి కల్పించేందుకు 13 రకాల యూనిట్లు మంజూరు చేయగా.. వీటిలో మైక్రో ఎంటర్ ప్రైజెస్, మిల్క్ పార్లర్, మీ సేవా కేంద్రాలు, బ్యాక్ యార్డ్ ఫౌల్ట్రీ, మదర్ యూనిట్స్, డెయిరీ, యూనిఫాం స్టిచ్చింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేస్ట్ మేనేజ్ మెంట్, మండల సమాఖ్య క్యాంటీన్లు, మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిష్ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఈవెంట్ ఆర్గనైజర్స్, కస్టమ్​హయిరింగ్ సెంటర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు. వీటిని ఏర్పాటు చేసేందుకు ఒక్కో యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు ప్రభుత్వం రుణంగా ఇస్తోంది. వీటి ద్వారా వస్తున్న ఆదాయంతో లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే యూనిట్లు గ్రౌండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తికావడంతో మహిళలు ఉపాధి పొందుతున్నారు. 

రోజుకు రూ. 1500 సంపాదిస్తున్నా

స్వయం సహాయక సంఘం నుంచి రూ.3లక్షల లోన్ తీసుకుని క్యాంటీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకున్నా. రోజుకు రూ.1500 సంపాదిస్తున్నా నెలకు ఖర్చులు పోను రూ.40 వేల మిగులుతోంది. దీని ద్వారా వస్తున్న పైసలతో నెలకు రూ. 9వేలు కడుతున్నా. 36 నెల్లలో నా బాకీ తీరుతది.. అప్పుడు క్యాంటీన్ మిగులుతుంది. క్యాంటీన్ ఏర్పాటుతో నాకు ఉపాధి దొరికింది.  - దాసరిస్వాతి, ఇల్లంతకుంట

పిండి గిర్నీ ఏర్పాటు చేసుకున్నా..

ప్రధానమంత్రి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కింద(పీఎంఎఫ్ఎమ్​) ద్వారా రూ.3లక్షల లోన్ తీసుకొని పిండి గిర్నీ ఏర్పాటు చేసుకున్నా. కరెంట్​బిల్లులు, ఇతర ఖర్చులు పోను రూ.20వేలు మిగులుతున్నాయి. 

పసకంటి రాజమణి, సంకెపల్లి గ్రామం