తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రికార్డు.. బాధితులకు రూ. 155 కోట్లు రిఫండ్

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరో రికార్డు సృష్టించింది.  మెగా లోక్ అదాలత్ లో 4,893 మంది బాధితులకు రూ.33.27 కోట్లు రీఫండ్ చేసింది.  గత ఏడాది కంటే లోక్ అదాలత్ ద్వారా  రూ. 27.2 కోట్లు అదనంగా  రికవరీ చేసింది.  తెలంగాణ వ్యాప్తంగా రూ. 155.22 కోట్ల రూపాయలను  బాధితులకు అందించింది. డిసెంబర్ 15 వరకు  17,210 మంది బాధితులకు రీఫండ్ చేసింది.  

లోక్ అదాలత్ లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన  పోలీస్ కమిషనరెట్స్ : 

  •  సైబరాబాద్: 2,136  కేసుల్లో రూ.12 కోట్ల 77 లక్షల 49 వేల 117 రీఫండ్ 
  •  హైదరాబాద్: 268 కేసుల్లో రూ.8,84,17,621 రీఫండ్
  •  రాచకొండ: 592  కేసుల్లో  రూ.4,53,06,114 రీఫండ్
  • సంగారెడ్డి జిల్లా  : 60 కేసుల్లో 1 కోటి 6 లక్షల 49 వేలు   రీఫండ్