పటాన్చెరు, వెలుగు: సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కాంగ్రెస్రాష్ట్ర నాయకుడు నీలం మధు అన్నారు. సోమవారం ఆమె 78వ బర్త్‌డే సందర్భంగా చిట్కూల్‌లోని ఎన్ఎంఆర్ క్యాంపు ఆఫీసులో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని రాజకీయ ప్రకంపనలు వచ్చినా అన్నింటిని తట్టుకుని తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, ఉద్యమకారుల ఆకాంక్షను నెరవేర్చిన దేవత సోనియాగాంధీ అన్నారు.
ఆమె త్యాగాలను గుర్తించి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారం కట్టబెట్టారన్నారు. ఇందిరమ్మను గుర్తుచేసేలా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో కార్యక్రమంలో భాగంగా గుమ్మడిదలలో తెలంగాణ తల్లి ఫొటోకు పూలమాలలు వేశారు. అనంతరం ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బాల్‌రెడ్డి, నర్సింగ్‌రావు, అనిల్, గణేశ్, రవీందర్, శ్యాం సుందర్ రెడ్డ, మాజీ సర్పంచ్ తులసీదాస్ పాల్గొన్నారు.