విశ్వ వేదికపై తెలంగాణ ప్రస్థానం ఉండాలి: సీఎం రేవంత్

  తెలంగాణ ప్రజలకు  సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో విశ్వ వేదికపై విజయ గీతికగా తెలంగాణ స్థానం, ప్రస్థానం ఉండాలని కోరారు.  ప్రతి ఒక్కరి జీవితంలో…ఈ నూతన సంవత్సరం శుభ సంతోషాలను నింపాలన్నారు. మనసారా కోరుకుంటూ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్. 

ఎమ్మెల్యే వివేక్ విషెస్

ప్రజలకు సంక్షేమ పథకాలను అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇంతకు ముందు ప్రజలపై జులూం చేసే ప్రభుత్వం ఉండేదన్నారు. ఇప్పుడు ప్రజాపాలన కొనసాగుతోందని అన్నారు వివేక్. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.