అదానీ ఆర్థిక అవకతవకలపై చలో రాజ్​భవన్

  • నీలం మధు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ 

పటాన్​చెరు, వెలుగు: అదానీ ఆర్థిక అవకతవకలపై బుధవారం తెలంగాణ కాంగ్రెస్​ఆధ్వర్యంలో చలో రాజ్​భవన్​ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పటాన్​చెరు మండలం చిట్కుల్​నుంచి కాంగ్రెస్​నేత నీలం మధు ఆధ్వర్యంలో 100కు పైగా వాహనాలలో కాంగ్రెస్​శ్రేణులు హైదరాబాద్​కు తరలివెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్​చార్జి దీప దాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

 అనంతరం మధు మాట్లాడుతూ.. అమెరికా లో అదానీపై వచ్చిన నేరారోపణలు దేశ ప్రతిష్టను దెబ్బతీశాయన్నారు. మణిపూర్ అల్లర్లు, విధ్వంసాలపై పీఎం మోదీ ఇప్పటి వరకు అక్కడకు వెళ్లలేదంటూ బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తులు అధిక సంఖ్యలో 
పాల్గొన్నారు.