రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతివనంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం (23 డిసెంబర్ 2024) సందర్శించారు. శాంతివనంలో చిన్నారులు, విద్యార్థులకు అందించే సాఫ్ట్ స్కిల్స్ కు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, చదవడం వంటి స్కిల్స్ ను అక్కడి విద్యార్థులు ప్రదర్శించడం చూసి సీఎం వారిని అభినందించారు. ఇలాంటి స్కిల్స్ ను ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్సియల్ స్కూల్స్ లోనూ అందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ALSO READ | రైతు భరోసా విధివిధానాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. చర్చించిన అంశాలు ఇవే..!
అనంతరం కన్హా శాంతివనం ఆవరణలోని ట్రీ కన్జర్వేషన్ సెంటర్ ను సందర్శించారు. వివిధ రకాల వంగడాల అభివృద్ధి, మొక్కల పెంపకానికి సంబంధించిన విధానాలను నిర్వాహకులు ముఖ్యమంత్రికి వివరించారు. శాంతి వనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెయిన్ ఫారెస్ట్ ను చూసిన అనంతరం మెడిటేషన్ సెంటర్ వద్ద గలిబుడ (Galibuda (Scientific Name: Hildergardia Populifolia) మొక్కను నాటి మెడిటేషన్ హాల్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ఎమ్మెల్యె శంకరయ్య, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.