గురుకులాల్లో సమూల మార్పులు తీసుకొస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

గురుకులాల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో కామన్ డైట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా చిల్కూరు రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి వారి లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. 

గురుకులాలలో అత్యున్నతమైన మెనూ

గురుకుల విద్యార్థులకు అత్యున్నతమైన మెనూ అందిస్తున్నామని సీఎం అన్నారు. నెలలో ఒక్కో వారానికి ఒక్కో మెనూ చొప్పున రెండు సార్లు చికెన్, రెండు సార్లు మటన్ ఇస్తున్నట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో విద్యార్థుల డైట్ చార్జీలను పట్టించుకోలేదని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్మోటిక్ ఛార్జెస్ 200 శాతం పెంచామని, మెస్ ఛార్జీలను 40 శాతం పెంచామని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత భారీగా ఛార్జీలు పెంచడం ఇదే మొదటి సారి అని గుర్తు చేశారు.

 రెసిడెన్షియల్ అంటే మల్టీ ట్యాలెంటెడ్ ఇన్ స్టిట్యూషనల్స్

గురుకులాల్లో మల్టీ టాలెంటెడ్ విద్యార్థులు ఉంటారని సీఎం అన్నారు. ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులకు ట్యాలెంట్ ఎక్కువ, ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు తక్కువ అనేది కేవలం అపోహ మాత్రమేనని అన్నారు. సర్వేల్ గ్రామంలో పీవీ నరసింహారావు మొట్టమొదటి గురుకుల పాఠశాల ప్రారంభించారని.. అక్కడి నుంచి చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ లు అయ్యారని గుర్తు చేశారు. 

టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రావెంకటేశం, మాజీ చైర్మన్ హేందర్ రెడ్డి మొదలైన వారు  సర్వేల్ రెషిడెన్షియల్ విద్యార్థులని.. ఇక్కడ ట్యాలెంట్ కు కొదవ లేదనేందుకు ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలని అన్నారు. మొదట్లో రెసిడెన్షియల్ స్కూల్ లలో, ప్రభుత్వ పాఠశాల్లో చదువుకకున్న వాళ్లు బాగా రాణించారని.. ఆ తర్వాత ప్రైవేట్ స్కూల్స్ పై అపోహా పెరగడం, ప్రభుత్వాలు ప్రభుత్వ సంస్థలపై దృష్టి పెట్టకపోవడం వలన నిరాదరణకు గురయ్యాయని తెలిపారు. ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులు చదువుతున్న ఈ సంస్థలపై సంపూర్ణమైన నమ్మకం కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు.