దేశ ఆర్థిక ప్రగతికి పీవీ దిశా నిర్దేశం: ఇయ్యాల వర్ధంతి సందర్భంగా స్మరించుకున్న సీఎం రేవంత్

హైదరాబాద్, వెలుగు: బహుభాషా కోవిదుడు, భారత మాజీ ప్రధాని స్వర్గీయ పాములపర్తి వెంకట నరసింహారావు సేవలు చిరస్మరణీయమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతికి దిశా నిర్దేశం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. సోమవారం ఆయన వర్ధంతిని పురస్కరించుకుని సీఎం నివాళులు అర్పించారు.