అర్జున్, ద్రోణవల్లి హారికకు చెరో రూ.25 లక్షలు

హైదరాబాద్, వెలుగు : చెస్ ఒలింపియాడ్‌‌లో దేశానికి స్వర్ణ పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి రూ.25 లక్షల చొప్పున ప్రోత్సాహకాలను ప్రకటించారు. తొలిసారి గోల్డ్ మెడల్స్  సాధించిన క్రీడాకారులు అర్జున్, ద్రోణవల్లి హారిక శుక్రవారం జూబ్లీహిల్స్‌‌లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. 

సీఎంతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి తదితరులు చెస్​ విజేతలను అభినందించారు.