ఫార్ములా ఈ రేస్పై ఏసీబీ విచారణకు కేబినెట్ ఆమోదం

తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఫార్ములా ఈ రేసింగ్ అవకతవకలపై చర్చించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ రేసింగ్ నిధుల మళ్లింపుపై ఏసీబీ విచారణకు ఆదేశించనున్నట్లు తెలిపారు. తెలంగాణ సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ రాయించాలని కేబినెట్ లో నిర్ణయించారు. 

మంగళవారం ఏసీబీకి లేఖ రాయాల్సిందిగా  సీఎస్ ను ఆదేశించినట్లు తెలిపారు. ఈ రేసింగ్ ఏజెన్సీ, నిర్వాహకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. అధికారులు కూడా ఈ వ్యవహారంలో విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ అంశంపై న్యాయ సలహా తీసుకొని గవర్నర్ ఆమోదం తెలిపారని, త్వరలోనే నిధుల దారి మళ్లింపు, అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి తెలిపారు.

అదే విధంగా కొత్త RoR చట్టాన్ని ఈ సావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఇక రేషన్ కార్డులు సంక్రాంతి తర్వాత ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

ALSO READ | ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ సభా హక్కుల నోటీసు