బీజేపీ తెలంగాణకు అక్కరకు రాని చుట్టము : కేసీఆర్

తెలంగాణకు ఒక్క నవోదయ స్కూల్, మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీ ఎందుకు ఓటేయ్యాలని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రశ్నించారు. మహబూబ్ నగర్ రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు.  దేశాన్ని నాశనం చేసిన మోదీ విశ్వగురువా అని నిలదీశారు.  బీజేపీ తెలంగాణకు అక్కరకు రాని చుట్టము అని చెప్పారు.  మోదీకీ ఓటేస్తే మోటర్లకు మీటర్లు పెట్టుడు ఖాయమేనన్నారు.  మోదీవన్నీ పిట్టకథలు, కట్టు కథలన్న కేసీఆర్...  తెలంగాణకు ప్రధాని ఏమీ చేయలేదని మండిపడ్డారు.   

ఈ పదేళ్లలో మోదీ కనీసం 100 నినాదాలు ఇచ్చారని.. అందులో ఒక్క నినాదం కూడా నెరవేరలేదన్నారు కేసీఆర్ . వాటితో ప్రజలకు ఎలాంటి లాభం జరగలేదని విమర్శించారు.  బడేబాయ్..మోడీ..చోటా భాయ్ రేవంత్ రెడ్డికి ఓటు వేసినా వేస్ట్ అని తెలిపారు.  తెచ్చిన తెలంగాణ కళ్లముందే నాశనం అయితుంటే చూసి ఊర్కోమని. యుద్ధం చేస్తామన్నారు కేసీఆర్. బీజేపీ, కాంగ్రెస్‌ రెండు ఏకమై ప్రాంతీయపార్టీలను దెబ్బతీయాలని చూస్తున్నాయని మండిపడ్దారు.  తెలంగాణ యవకులదేనని.. పనిచేసే వాళ్లకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్.