ఇయ్యాల అసెంబ్లీ మళ్లీ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సోమవారం తిరిగి ప్రారంభం కానుంది. ఉదయం 10:00 గంటలకు సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతిదేవి, రామచంద్రారెడ్డి, ఊకే అబ్బయ్యకు సంతాపం తెలపనున్నారు. అనంతరం ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. యంగ్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఫిజికల్‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ-–2024, తెలంగాణ యూనివర్సిటీల అమెండ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌–2024 బిల్లులను సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. అలాగే టూరిజం పాలసీపై సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. 

ఈ నెల 9న మొదలైన అసెంబ్లీ సమావేశాలు 16వ తేదీకి వాయిదా పడ్డాయి. సోమవారం జరిగే బీఏసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో సమావేశాలు ఎప్పటి వరకు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 21 వరకు సమావేశాలు ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, సోమవారం మధ్యాహ్నం 2గంటలకు అసెంబ్లీ హాల్‎‎లో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఆర్వోఆర్–-2024 డ్రాఫ్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రైతు భరోసా, గ్రామాల్లో వీఆర్వోల నియామకం, ఏడాది ప్రజాపాలన, కులగణన, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై చర్చించనుంది.