Weather update: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు..  జనం ఉక్కిరిబిక్కిరి.. బయటకు వస్తే అంతే సంగతులు!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ భగ మండిపోతున్నాడు.  హీట్​ వేవ్​ పరిస్థితులతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.  ఉదయం 10 దాటితే బయట అడుగు పెట్టాలంటే జంకుతున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ(IMD) ప్రకటించింది. తెలంగాణలో మూడురోజులు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

తెలంగాణలో...

తెలంగాణలో మరో మూడు రోజులు ( ఏప్రిల్​ 3 వరకు)  హీట్ వేవ్ పరిస్థితులు(Telangana Heat Wave conditions) ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD)ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత(Rising Temperatures) పెరుగుతోంది. ఉదయం నుంచే భానుడి భగభగలాడుతున్నాడు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు 42 నుంచి 48  డిగ్రీలకు చేరే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.   తెలంగాణలో రేపు, ఎల్లుండి ( ఏప్రిల్​ 1,2)  వడగాల్పులు(Heat Wave) వీచే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే రెండింతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది

ఏపీలో వడగాల్పులు

ఏపీలో ఎండలు(AP Heat Wave) మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు(Temperatures) అతి సాధారణంగా నమోదు అవుతున్నాయి. ఆదివారం ( మార్చి 31)  33 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. సోమవారం ( ఏప్రిల్​ 1)  64 మండలాల్లో వడగాల్పులు, ఒక మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శనివారం ( మార్చి 30)ఏడు మండలాల్లో తీవ్రవడగాల్పులు, 52 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు ఆయన పేర్కొన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మూడు రోజులు అలర్ట్

ఆదివారం ( మార్చి 31)  కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వడగాడ్పులు(Heat Wave in Andhra Pradesh) వీచినట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రానున్న మూడు రోజుల్లో ( ఏప్రిల్​ 3 వరకు) ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం(ఏప్రిల్​ 1) ఏపీలోని 64 మండలాల్లో అసాధారణ స్థాయిలో వడగాడ్పులు, మరో 52 మండలాల్లో ఓ మాదిరి వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ALSO READ | పబ్లిక్​ ఫోన్ చార్జింగ్​ పిన్స్ వాడొద్దు..కేంద్రం వార్నింగ్