బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మూడు దశల వారీగా జరిగి ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైన రెండో దశలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ కడుతున్నారు. మెత్తం 94 అసెంబ్లీ స్థానాలకు గాను 17 జిల్లాల్లో 41,362 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల కమీషన్. రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకున్న బీహార్ మాజీ సీఎం రబ్రీదేవీ మాట్లాడుతూ..మహాకూటమి తరఫున సీఎం అభ్యర్థిగా భావిస్తున్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్(రాఘోపుర్), ఆయన సోదరుడు తేజ్‌ప్రతాప్ యాదవ్(హసన్‌పుర్) పోటీ చేస్తున్నారు. రాఘోపుర్ నుంచి పోటీ చేస్తున్న తేజస్వీ యాదవ్ బీహార్ ముఖ్యఅవుతారని ధీమా వ్యక్తం చేశారు. తమ అలయన్స్ అభ్యర్ధులు ఏ అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీ చేసినా గెలుస్తారని బీహార్ మాజీ సీఎం రబ్రీదేవీ జోస్యం చెప్పారు.
