బరువు తగ్గేందుకు క్రికెట్ బ్యాట్ పట్టిన తేజస్వీ యాదవ్!

బరువు తగ్గేందుకు క్రికెట్ బ్యాట్ పట్టిన తేజస్వీ యాదవ్!

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చాలాకాలం తర్వాత బ్యాట్ పట్టాడు. బ్యాట్ తో కఠోర ప్రాక్టీస్ చేస్తున్నాడు. పాట్నాలోని తన ఇంటి ఆవరణలో తాత్కాలిక క్రికెట్ పిచ్ పై చెమటలు పట్టేలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. షార్ట్ లు, టీషర్ట్, చేతికి బ్లౌజులు ధరించి భారీ షాట్లు కొట్టాడు. రెండు ప్లాస్టిక్ చైర్లను వికెట్లుగా ఉపయోగించుకుని బ్యాట్ కు పనిచెప్పాడు. అతని డ్రైవర్, వంటవాళ్లు బౌలింగ్ వేస్తుంటే భారీ షాట్లు ఆడాడు. అనంతరం అతను కూడా బౌలింగ్ చేశాడు. అసలు తేజస్వీ యాదవ్ బ్యాట్ ఎందుకు పట్టాల్సి వచ్చింది..? బరువు తగ్గించుకునేందుకా లేక..మోడీ ఎఫెక్టా అనేది అర్థం కావడం లేదు. ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ, తేజస్వీ యాదవ్ కలుసుకున్నారు. ఆ సమయంలో బరువు తగ్గించుకోవాలని తేజస్వికీ ప్రధాని సూచించారు. ఇక అంతే మోడీ చెప్పిన మాటలకు తేజస్వీ యాదవ్ బ్యాట్ పట్టాడని కొందరు చెప్పుకుంటున్నారు. నిజానికి తేజ‌స్వీ యాదవ్ ఒక‌ప్పుడు క్రికెట‌ర్‌. ఓసారి ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జ‌ట్టు అత‌న్ని కొన్నది. కానీ ఇటీవ‌ల తేజ‌స్వి యాదవ్ కు పొట్ట  పెరిగిపోయింది. ఈ మ‌ధ్య రాసిచ్చిన నోట్‌ను కూడా అత‌ను చ‌ద‌వలేక‌పోతున్నట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే దేని ప్రభావ‌మో ఏమో కానీ.. తేజ‌స్వి మ‌ళ్లీ స్లిమ్ అయ్యేందుకు బ్యాట్ ప‌ట్టాల్సి వ‌చ్చింది. బ్యాట్ తో భారీ షాట్లు ఆడుతున్న వీడియోను తేజస్వీ యాదవ్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. జీవితం, ఆట ఎప్పుడూ గెలవడానికే ఆడాలన్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.