Good Health: పంటి నొప్పి వేధిస్తుందా.. అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి..

పంటినొప్పితో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఎన్ని మందులు వాడినా ఈ సమస్య అంత త్వరగా తగ్గదు. అయితే చిన్నచిన్న చిట్కాలతో ఈ సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చు. పళ్లు వదులుగా మారడం, ఇన్ఫెక్షన్, విరగడం, చిగుళ్ల వాపు వంటివి పంటినొప్పికి కారణాలు. ఈ నొప్పి రెండ్రోజులకు మించి ఉంటే తప్పనిసరిగా డాక్టర్ ను కలవాల్సిందే. అయితే డాక్టర్​ ను  కలిసేలోపు ఓసారి ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి... 

Also Read :- కనుబొమ్మలు అందంగా.. పెద్దగా పెరగాలంటే ఇలా చేయండి..!

  • కోల్డ్ కంప్రెస్ లేదా ఐస్ ప్యాక్ పంటి నొప్పిని వెంటనే తగ్గిస్తుంది.
  • పంటి నొప్పి, ఏదైనా గాయం, చిగుళ్ళ వాపు ఉన్నప్పుడు ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. 
  • వెచ్చని ఉప్పు నీటితో నోటిని శుభ్రం చేస్తే పళ్ల సందుల్లో ఉన్న ఇన్ఫెక్షన్ కొంతవరకు తగ్గుతుంది. వాపును కూడా తగ్గిస్తుంది. ఫలితంగా పంటినొప్పి నుంచి రిలీఫ్ దొరుకుతుంది.
  •  సిటమినోఫెన్ మరియు ఇబుప్రోఫెన్ వంటి మందులు పంటి నొప్పికి తాత్కాలిక నొప్పి నివారణను అందిస్తాయి. అయితే, 16 ఏళ్లలోపు పిల్లలకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆస్పిరిన్ ఇవ్వకూడదని గుర్తుంచుకోండి. 
  • వెల్లుల్లి రసాన్ని కూడా నొప్పితో ఉన్న పంటిపై అద్దాలి. అందులో ఉండే అల్లిసిన్ యాంటీ బ్యాక్టీరియల్ జెల్ గా పనిచేస్తుంది. కొద్ది క్షణాల్లోనే నొప్పి తగ్గుతుంది. పంటి నొప్పికి లవంగాలు వాడతారని అందరికీ తెలుసు. 
  • పుదీనా టీ తాగినా కూడా పంటి నొప్పి నుంచి రిలీప్ దొరుకుతుంది. మెంథాలు కూడా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి