Geyser leak: స్నానం చేస్తుండగా గీజర్ లీక్..ఊపిరాడక టీనేజ్ గర్ల్ మృతి

వింటర్ సీజన్ లో మనం ఎక్కువగా వేడి నీళ్లతో స్నానం చేస్తుంటాం. మరి వేడి నీల్లు కావాలంటే.. రకరకాల పద్దతుల్లో నీళ్లను వేడి చేస్తుంటాం.. సాధారణంగా గ్రామాల్లో కట్టెల పొయ్యి మీద, కొంతమంది స్టౌ మీద వేడి చేస్తున్నాంటారు.. ఇంకొందరు హీటర్లు వాడుతుంటారు.. ఇక పట్టణాల్లో అయితే వేడి నీటి కోసం గీజర్లు వాడుతుంటారు. అయితే నీళ్లను హీట్ చేసుకునే క్రమంలో ఇటీవల కాలంలో ప్రమాదాలు పెరిగిపోయాయి. మనం తరచుగా వార్తల్లో చూస్తుంటాం.. నీళ్లు వేడి చేసుకునేందుకు పెట్టిన హీటర్  షాక్ తో వ్యక్తి మృతి.. బాత్ రూంలో స్నానం చేస్తుండగా గీజర్ షాక్ తో వ్యక్తి మృతి.. ఇలా హీటర్ , గీజర్ ప్రమాదాలకు సంబంధించి వార్తలు మనం వింటుంటాం..  చూస్తుంటాం.. సరిగ్గాల అలాంటిదే ఓ ఘటన యూపీలో జరిగింది.  స్నానం  చేస్తుండగా గీజర్ లీక్  అయి.. బాలిక బలైంది. వివరాల్లోకి వెళితే..   

యూపీలోని అలిగఢ్ లో బాత్ రూం లోని గీజర్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఊపిరాడక 16 యేళ్ల  విద్యార్థిని మృతిచెందింది. కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహి అనే విద్యార్థిని బాత్ రూం లో స్నానం చేస్తుండగా గీజర్ నుంచి గ్యాస్ లీకు కావడంతోఊపిరాడక విద్యార్థిని స్పృహ తప్పి పడిపోయింది.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మహి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె  మృతిచెందినట్లు డాక్టర్ తెలిపారు.

అలీగఢ్ లోని కుల్దీప్ విహార్ కాలనీలో ఈఘటన జరిగింది. రోజు లాగే మహి స్నాం చేయడానికి బాత్ రూం వెళ్లింది. వింటర్ సీజన్ కావడంతో వేడినీళ్ల కోసం గీజర్ ను ఆన్ చేసింది. అయితే గీజర్ నుంచి కెమికల్ వాయివు రిలీజ్ కావడంతో స్పృహతప్పి పడిపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మహి ప్రాణాల మీదకు వచ్చిందని  కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మహిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకొని , మహి మృత దేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి..కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

వింటర్ సీజన్ లో వేడి నీళ్ల కోసం గీజర్లు, హీటర్లు వాడుతున్నప్పుడు ప్రజల చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ ఇన్సిడెంట్ చెబుతోంది.  సో .. హీటర్, గీజర్లు వాడేటప్పుడు బీకేర్ ఫుల్.