టెక్నాలజీ : నయా ఫీచర్స్​తో నోట్‌‌బుక్‌‌ ఎల్‌‌ఎం

నోట్‌‌బుక్‌‌ ఎల్‌‌ఎం (Notebook LM)ను గతంలో ప్రాజెక్ట్ టైల్‌‌విండ్‌‌ అని పిలిచేవారు. యూజర్లకు వారి డాక్యుమెంట్​ల నుంచి కంటెంట్‌‌తీసుకోవడానికి, క్రియేట్​ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. కొత్త గూగుల్ ఏఐ డివైజ్​ల్లో ఒకటి గూగుల్ జెమిని. రఫ్ నోట్స్‌‌ని తక్కువ వాక్యాలతో వరుస క్రమంలోకి మారుస్తుంది నోట్‌‌బుక్‌‌ ఎల్‌‌ఎం. దీని ద్వారా సెర్చ్​, టైపింగ్​ ఈజీ అవుతాయి. 

నోట్‌‌బుక్‌‌ ఎల్‌‌ఎం కార్యాచరణ వివిధ రకాల డాక్యుమెంట్ రకాలను ప్రాసెస్ చేస్తుంది. ముఖ్యంగా  రీసెర్చ్ నోట్స్​​తో పాటు ఇంటర్వ్యూ ట్రాన్స్​స్క్రిప్ట్‌‌లు, కార్పొరేట్ పత్రాలు, పీడీఎఫ్‌‌లు, గూగుల్ డాక్స్, గూగుల్ స్లయిడ్‌‌లు, టెక్స్ట్ ఫైల్‌‌లు, వెబ్ యూఆర్ఎల్‌‌లను కూడా అప్‌‌లోడ్ చేయొచ్చు. 

  •     ఇన్‌‌లైన్ సిటేషన్స్ – కంటెంట్​లో ఏదైనా ఈజీగా సెర్చ్ చేసేందుకు ఉపయోగపడుతుంది.  
  •     నోట్‌‌బుక్ గైడ్ – తరచూ అడిగే ప్రశ్నలు, బ్రీఫింగ్ డాక్స్ లేదా స్టడీ గైడ్స్ వంటి ఫార్మాట్‌‌లుగా మారుస్తుంది. 
  •     జెమిని1.5 ప్రో మల్టీమోడల్ – యూజర్లు కంటెంట్​కి సంబంధించిన చిత్రాలతో పాటు చార్ట్‌‌లు, గ్రాఫ్​ల గురించి ప్రశ్నించొచ్చు. ముఖ్యంగా నోట్ బుక్ ఎల్ఎంకు పూర్తి ప్రైవసీ, సేఫ్టీ ఉందని గూగుల్ హామీ ఇస్తోంది.