స్మార్ట్ ఫోన్ మేకర్ టెక్నో ఫాంటమ్ ఎక్స్ 2 ప్రో 5జీ పేరుతో ఇండియా మార్కెట్లో ప్రీమియం ఫోన్ లాంచ్ చేసింది. కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే, సరికొత్త కెమెరా సెటప్, కొత్త కలర్స్ తో ఫోన్ లుక్ ఆకట్టుకుంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్ సెట్, 50 మెగాపిక్సెల్ రెట్రాక్టబుల్ పోర్ట్రెయిట్ లెన్స్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. 50 ఎంపీ టెలిఫొటో లెన్స్, 13 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి.
6.8 ఇంచుల డిస్ ప్లే, 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ 12 జీబీ+256 జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ తో వస్తోంది. ఈ నెల 24 నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. టెక్నో ఫాంటమ్ ఎక్స్ 2 ప్రో 5జీని అమెజాన్ లో రూ.50 వేలు చెల్లించి ప్రీ బుక్ చేసుకోవచ్చు. మార్స్ ఆరెంజ్, స్టార్ డస్ట్ గ్రే కలర్ లో అందుబాటులో ఉన్నాయి.
