- 600 మందిని నియమించుకుంటామన్న కంపెనీ
- యాప్స్ పెరుగుతుండడంతో జాబ్స్ పెరుగుతాయంటున్న టీమ్‌లీజ్
న్యూఢిల్లీ: టెక్ మహీంద్రా గ్రూప్ కంపెనీ కామ్‌వివా వచ్చే ఏడాది జులై లోపు 600 మంది ఇంజినీర్లను నియమించుకోవాలని చూస్తోంది. డిమాండ్‌ను చేరుకోవడానికి, అట్రిషన్ (ఉద్యోగులు మానేస్తుండడం) ను కవర్ చేయడానికి ఈ నియమకాలను చేపట్టాలని చూస్తోంది. కంపెనీ 3 ఏళ్ల కిందట భువనేశ్వర్‌లో ఒక సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌ను విస్తరించే పనిలో ఉన్నామని కామ్‌వివా సీఈఓ మనోరంజన్ మహాపాత్ర అన్నారు. ప్రస్తుతం టైర్ 2 సిటీలపై ఫోకస్ పెట్టామని చెప్పారు. ‘మా టీమ్‌లో 2 వేల మంది ఉన్నారు. ఏడాదికి 600 మందిని చొప్పున యాడ్ చేసుకోవాలని చూస్తున్నాం. ఇందులో 300 మంది ఫ్రెషర్లు. వీరిని క్యాంపస్ ఇంటర్వ్యూలలో తీసుకుంటాం. మరో 200–300 మందిని మార్కెట్‌లో ఉన్నవారిని నియమించుకుంటాం’ అని ఆయన అన్నారు. గత కొన్ని క్వార్టర్లలో కంపెనీ అట్రిషన్ రేటు 20–23 శాతానికి పెరిగింది. గతంలో ఇది 15 శాతంగా ఉండేది. ‘భువనేశ్వర్ సెంటర్‌లో ప్రస్తుతం 20 మంది ఉన్నాం. ఈ నెంబర్‌ను 60 మందికి తీసుకెళ్తం. మరో రెండు మూడేళ్లలో ఈ నెంబర్‌ను 200–300 కు పెంచుతాం’ అని చెప్పారు.
5జీ వలన హైరింగ్ పెరుగుతుంది..
మొబైల్ టెక్, గేమింగ్, ఎడ్–టెక్ ఇండస్ట్రీలు విస్తరిస్తుండడంతో స్కిల్స్ ఉన్న ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ పెరుగుతుందని టీమ్‌లీజ్ అభిప్రాయపడింది. 5జీ కి మారుతుండడంతో రానున్న నెలల్లో హైరింగ్ యాక్టివిటీ మరింత విస్తరిస్తుందని పేర్కొంది. మొబైల్ యాప్స్‌కు డిమాండ్ పెరుగుతుండడంతో కొత్తగా 6 వేల స్కిల్ బేస్డ్ జాబ్స్ క్రియేట్ అవుతాయని టీమ్‌లీజ్ అభిప్రాయపడింది. దేశంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం ఎక్కువగా ఉండడంతో ఎడ్‌టెక్, గేమింగ్, ఫిన్‌టెక్ ఇండస్ట్రీలలో కొత్త యాప్స్ రావడం పెరుగుతుందని అంచనావేసింది. ఈ జాబ్స్ కోసం వచ్చే 6–9 నెలల్లో హైరింగ్ జరుగుతుందని పేర్కొంది.
